తెలంగాణలో విద్యా సంస్థలు రీ ఓపెన్.. కాసేపట్లో అధికారిక ప్రకటన !

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించగా.. వాటిని ఈ నెల 30 వరకు పొడగించారు. రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లండి నుంచి తిరిగి విద్యా సంస్థలు తెరచుకొనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. సాయంత్రంలోగా అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా.. కరోనా సోకిన రోగులు హాస్పటల్ లో చేరాల్సిన పరిస్థితులు పెద్దగా కనబడటం లేదు. సాధారణ జలుబు, నీరసం, తలనొప్పితో కరోనా తగ్గిపోతుంది. ఇదీగాక.. కరోనా పాజిటివిటీ రేటు 10శాతం దాటితేనే కర్ఫ్యూ, తదితర ఆంక్షలు విధిస్తారు.

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను రీ ఓపెన్ చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలలను తెరిచేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర జనవరి 24 నుంచే స్కూళ్లను పునఃప్రారంభించిన విషయం తెలిసిందే.