బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ బీజేపీ లో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి క్లీన్ ఇమేజ్. ఆయన చేరికతో ఏపీలో బీజేపీ మరింత బలపడుతుందని ఆశిస్తున్నామని ప్రహ్లాద్ జోషి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. రోషయ్య తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన సీఎం గా కొనసాగారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి.. విభజన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ మధ్య తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా.. యాక్టివ్ గా పని చేయలేదు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరడంతో.. ఏపీ బీజేపీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.