నెలలో యాదాద్రి పనులు పూర్తి


తెలంగాణ తిరుపతి తిరుపతి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రతి యేడాది బడ్జెట్ లో రూ. 100కోట్లు కేటాయిస్తోంది. ఇప్పుడీ పనులు ఆఖరి దశకు చేరుకొన్నాయి. నవంబర్ నెలాఖరి కల్లా పనులు పూర్తవుతాయని ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడా) చెబుతోంది. మరో ఆరు నెలల్లో భక్తులకు స్వయంభువుల దర్శనభాగ్యం కలగనుంది. రక్షణ గోడ, 4.3 ఎకరాల విస్తీర్ణంతోకూడిన ఆలయ విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పునర్నిర్మితమయ్యే దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలతోపాటు నిర్వహించనున్నారు. ఆ మేరకు చినజీయర్‌ స్వామి ముహూర్తాన్ని నిశ్చయిస్తారని యాడా వర్గాలు చెబుతున్నాయి.