రివ్యూ : ఈటీ

చిత్రం : ఈటీ (ఎవరికీ తలవంచడు)
నటీనటులు : సూర్య, ప్రియాంక మోహన్, వినయ్ రాయ్ తదితరులు
సంగీతం : డి. ఇమ్మాన్
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాత :  సన్ పిక్చర్స్ 
రిలీజ్ డేట్ : 10 మార్చి, 2022.

కోలీవుడ్ స్టార్ సూర్యకుక్ తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన ప్రతి సినిమా టాలీవుడ్ లోనూ విడుదల అవుతుంది. ఆయన గత రెండు సినిమాలు ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ తెలుగులోనూ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య నటించిన చిత్రం ఈటీ – ‘ఎవరికీ తలవంచడు’. భారీ అంచనాల మధ్య ఈటీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ఈటీ ఎలా ఉంది ? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. ! 

కథ : 

కృష్ణమోహన్ (సూర్య) లాయర్. చురుకైన వ్యక్తి. చిన్నప్పుడే సొంత అక్కను కోల్పోవడంతో.. ప్రతి అమ్మాయిని తన సొంత చెల్లిగా చూసుకుంటూ వారి క్షేమం కోసం పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో తన సొంత ఊర్లో కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని, యాక్సిడెంట్ కారణంగా చనిపోతుంటారు. ఈ అమ్మాయిల బలవంతపు హత్యలకు కారణం ఎవరు? అనేది వెతకడం మొదలెట్టిన కృష్ణమోహన్ కు కొన్ని నమ్మలేని నిజాలు తెలిస్తాయి. ఇంతకీ ఏమిటా నిజాలు ? ఈ బలవంతపు హత్యల వెనుక ఉన్నదెవరు? అనేది ఈటీ కథ.

ఎవరెలా చేశారు ?

సూర్య నటనకు వంక పెట్టలేం. పాత్రలో లీనమైపోతాడు. ఈటీలోనూ సూర్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. చిన్నతనంలోనే అక్కను కోల్పోయిన తమ్ముడిగా, లాయర్ గా భిన్నమైన షేడ్స్ ను చక్కగా పోషించాడు సూర్య. హీరోయిన్ ప్రియాంక తెరపై అందంగా కనిపించింది. కానీ నటనలో ఇంకా చాలా డెవలప్ కావాలి. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్స్ విషయంలో చాలా ప్రాక్టీస్ అవసరం. ఇక ప్రతినాయక పాత్రలో వినయ్ రాయ్, తండ్రి పాత్రలో సత్యరాజ్, తల్లిగా శరణ్య తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

టెక్నికల్ గా :
టెక్నికల్ గా ఈటీ రిచ్ గా ఉంది. డి.ఇమ్మాన్ మాస్ ట్యూన్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. దర్శకుడు పాండిరాజ్ రాసుకున్న కథ-కథనం బాగుంది. కానీ ఇలాంటి కథలకు కాలం చెల్లింది. ఈ కాలంలో తీయాల్సిన సినిమా కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్ తెలుగు నేటివిటికి కనెక్ట్ కాలేదు. క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఓవర్ డోస్ అనిపించింది. 

ప్లస్ పాయింట్స్ :
సూర్య నటన
మాస్ బీట్స్
సినిమాటోగ్రఫీ
కొన్ని ఎలివేషన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
ఫ్యామిలీ ఎమోషన్స్
క్లైమాక్స్
రొటీన్ కథ-కథనం

బాటమ్ లైన్ : ఈటీ.. సీటీ వేసే రేంజ్ లో లేదు 
 రేటింగ్ : 2.75/5