రివ్యూ : ThankYou

చిత్రం : ThankYou

నటీనటులు : నాగ చైతన్య, రాశీఖన్నా, మాళవిక నాయర్ తదితరులు

సంగీతం : థమన్

దర్శకత్వం : విక్రమ్ కుమార్

నిర్మాత : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 22 జులై, 2023.

నాగ చైతన్య ప్రేమ కథలు బాగా సూటవుతాయి. ఆయన కెరీర్ లోని విజయాలు దాదాపు ప్రేమకథలే. ‘ప్రేమమ్’ కూడా ప్రేమకథే. అయినా.. డిఫరెంట్ ఏజ్ లో కథ సాగుతుంది. థ్యాంక్యూ కూడా అలాంటి కథ. మనం తర్వాత విక్రమ్ కుమార్ – నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిన చిత్రమిది. ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన థ్యాంక్యూ ఎలా ఉంది ? తెలుసుకుందాం పదండీ..!

కథ :

అభిరామ్ (నాగ‌చైత‌న్య) పేదింటి పోరడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌డి మ‌న‌సుని చూసి ప్రియ (రాశీఖ‌న్నా) ప్రేమిస్తుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.

నటీనటుల పర్ఫామెన్స్ :

థ్యాంక్యూ తెలిసిన కథే. తెలిసో తెలియ‌కో ఒక్కొక్కరూ మ‌న జీవితాన్ని ఒక్కో మ‌లుపు తిప్పుతుంటారు. మ‌నం ఎదిగాక కృత‌జ్ఞత‌గా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయ‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్  లాంటి కథ అన్నమాట. తెలిసిన కథే ఎంచుకున్నప్పుడూ ట్రీట్ మెంట్ కొత్తగా ఉండాలి. కానీ ఆ ప్రయత్నం ఏమీ జరగలేదు. అయితే కథలోకి తీసుకెళ్లే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మాళవిక నాయర్-చైతూ ఏపీసోడ్. పోకిరి కటౌట్ తో చైతూ కనిపించే సీన్స్ అలరిస్తాయి. ఐతే సెకండాఫ్ తేలిపోయింది. ఎమోషనల్ సీన్స్ పండవు. దీంతో ప్రేక్షకుడు బోర్ గా ఫీలవుతాడు.

కథ-కథనాల గురించి పక్కన పెడితే చైతూ నటన బాగుంది. మూడు కోణాల్లో చైతూ పాత్ర క‌నిపిస్తుంది. ఆ మూడు గెట‌ప్పుల్లోనూ త‌న‌దైన మార్క్ క‌నిపిస్తుంది. రాశీఖ‌న్నాతో క‌లిసి ప‌తాక స‌న్నివేశాల్లో అభిన‌యం ఇంకా బాగుంటుంది. మాళ‌విక నాయ‌ర్ పార్వతి పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. అవికాగోర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో థమన్ మ్యాజిక్ కనిపించలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఆయన మార్క్ చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. 

బాటమ్ లైన్ : థ్యాంక్యూ.. చెప్పాల్సిన రేంజ్ లో లేదు.  

రేటింగ్ : 2.5/5