ఆస్కార్ పట్టు పట్టారు.. ఇలా !

94వ ఆస్కార్‌ వేడుకల్లో ఉత్తమ నటీనటులుగా మెరిశారు విల్‌స్మిత్‌, జెస్సికా ఛస్టెయిన్‌. ఆండ్రూ గార్‌ఫీల్డ్‌, బెనిడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌, జేవియర్‌ బార్డెమ్, డెంజిల్‌ వాషింగ్టన్‌ను వంటి దిగ్గజ నటులను వెనక్కినెట్టి ‘కింగ్‌ రిచర్డ్‌’ సినిమాలోని నటనకు ఆస్కార్‌ విల్‌స్మిత్‌ సాధించారు.

ప్రపంచం మెచ్చిన టెన్నిస్‌ క్రీడాకారిణులు వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి, కోచ్‌ రిచర్డ్‌ విలియమ్స్‌ జీవిత కథతో రూపొందిన చిత్రమిది. రిచర్డ్‌ పాత్రలో విల్‌స్మిత్‌ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి. ఆస్కార్‌ను అందించాయి. విల్‌స్మిత్‌ ర్యాప్‌ సింగర్‌, నిర్మాతగానూ తనదైన ముద్రవేశాడు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ (హిందీ) సినిమాలో విల్‌స్మిత్‌ అతిథిగా మెరిశారు.

‘జోలెన్‌’తో వెండితెరకు పరిచయమైన జెస్సికా ఛస్టెయిన్‌. ‘ఇంటర్‌స్టెల్లర్‌’లో శాస్త్రవేత్తగా, ‘ది మార్టిన్‌’లో వ్యోమగామిగా కనిపించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫాయే’ చిత్రంలోని నటనకుగానూ ఆమెకు ఆస్కార్ వరించింది. నికోల్‌ కిడ్‌మన్‌, ఒలివీయా కోల్‌మెన్‌, పెన్లోప్‌ క్రూజ్‌, క్రిస్టిన్‌ స్టివార్ట్‌లతో పోటీపడి విజేతగా నిలిచింది.