అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. టీమిండియా టార్గెట్ 273

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్‌ లో అఫ్గానిస్థాన్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆఫ్గాన్ తొలి బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజ్మతుల్లా (62; 69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడంతో.. ఆ జట్టు 272 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఒకానొక దశలో ఆఫ్గాన్ స్కోర్ 300 దాటేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో 272 పరుగులకు కట్టడి చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా 4, హార్దిక్ పాండ్య 2, మహ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

273 టార్గెట్ ను చేధించడం టీమిండియాకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. ఎందుకంటే ? పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. బాల్ నేరుగా బ్యాట్ మీదకు వస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా టర్న్ లభించడం లేదు. పైగా ఇది కింగ్ కోహ్లీ సొంత మైదానం. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దాడి ధీటుగా ఉండనుంది. ఈజీగా విన్ అవుతుంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.